* వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
ఆకేరు న్యూస్, అమరావతి : దీపావళి పండుగ పూట ఏపీలోని అల్లూరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అల్లూరి జిల్లా(Alluri District) చింతపల్లి మండలం లంబసింగి ఘాట్‌రోడ్డులో ఎదురెదురుగా వచ్చిన వ్యాన్(van), బైక్(bike) ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలను తెలుసుకునే ప్రయత్నంచేస్తున్నారు. లారీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా (NTR District) జి.కొండూరు మండలం ఆత్కూర్ క్రాస్ రోడ్డు లో లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌తో సహ మరో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. లారీ డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
