* తాజా రాజకీయాలతో పాటు.. శాంతిభద్రతలపైన చర్చ
* నేరాల అదుపులో ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ సూచన
ఆకేరున్యూస్, అమరావతి: హోంమంత్రిపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల అనంతరం ఏపీ రాజకీయాలు వేడెక్కిన క్రమంలో హోంమంత్రి అనిత డిప్యూటి సిఎం పవన్ కళ్యాణత్తో భేటీ అయ్యారు.డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (PAWAN KALYAN), హోంమంత్రి అనిత (ANITHA) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోం శాఖ తీసుకుంటున్న చర్యలను పవన్ కల్యాణ్‌కు అనిత వివరించారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అనిత తెలిపారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం శ్రమించే ప్రజా ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమని నేతలు చర్చించుకున్నారు. తానూ ఫేక్ పోస్టు బాధితురాలినంటూ అంటూ అనిత పవన్ కల్యాణ్‌తో అన్నారు. తన కూతురు కన్నీరు చూసే తాను ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానని పవన్ వెల్లడిరచారు. ఈ క్రమంలో హోం మంత్రి అనిత ఆసక్తికర పోస్ట్ చేశారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తో మార్యదపూర్వకంగా సమావేశమైనట్లు పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారన్నారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పరిశ్రమించే ప్రజా ప్రభుత్వం తమ కూటమి ప్రభుత్వం అంటూ అనిత పేర్కొన్నారు. ఇటీవల పిఠాపురం పర్యటనలో రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హోం మంత్రి బాధ్యత వహించాలని.. మరింత కఠినంగా వ్యవహరించాలంటూ పవన్ కల్యాణ్ సూచించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందిచిన హోంమంత్రి అనిత.. దీనిని తాను పాజిటివ్‌గా తీసుకుంటున్నానని చెప్పారు.. హోంమంత్రిగా తాను ఫెయిల్ అని పవన్ ఎక్కడా అనలేదని.. పవన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే.. పవన్ కల్యాణ్ ఢల్లీి పర్యటనకు వెళ్లడం.. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడం.. వెనువెంటనే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హోమంత్రి అనిత సమావేశం అవ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
