* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా విజయోత్సవాలను నిర్వహించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ(CONGRESS GOVERNMENT) నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ (TELANGANA) బతుకు ఆగమైందని మండిపడ్డారు. కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలు ఎలా జరుపుకుంటారని కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. ఇది విజయోత్సవం కాదని, కుంభకోణాల కుంభమేళా అని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసినందుకు జరపాల్సింది విజయోత్సవాలు కాదు.. ప్రజావంచన వారోత్సవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనా వైఫల్యాలకు కేరాప్ కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. సంక్షోభం తప్ప సంతోషం లేని పాలనకు చిరునామా రేవంత్ (REVANTH) సర్కార్ అని నిప్పులు చెరిగారు. రుణమాఫీ (RUNAMAFI) కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు దుఖంలో ఉంటే మీరు విజయోత్సవాలు చేసుకుంటారా?.
హైడ్రా, మూసీ బాధితులు బాధలో ఉంటే మీరు బాజాభజంత్రీలతో పండుగ చేసుకుంటారా?. ఆడబిడ్డలు రక్షణ లేక అల్లాడుతుంటే మీరు విజయోత్సవాల పేరిట విర్రవీగుతారా?. వృద్ధులు పింఛన్ల పెంపు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే మీరు దయలేకుండా దావత్లు చేసుకుంటారా?. బీఆర్ఎస్ (BRS) భర్తీచేసిన ఉద్యోగాల ప్రక్రియను మీ ఖాతాలో వేసుకోవడం నయవంచన కాదా ?. పావుశాతం కూడా రుణమాఫీ(RI=UNAMAAFI) పూర్తిచేయకుండా వందశాతం చేశామని చెప్పుకోవడం దగా కాదా?. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ పథకాలకు సవాలక్ష ఆంక్షలు పెట్టి మెజారిటీ అర్హులను దూరం చేయడం మోసం కాదా?. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో అతితక్కువ సమయంలో అత్యధిక ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న తొలి ప్రభుత్వం, ఏకైక రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెసే (CONGRESS)నని కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.
…………………………………….