* కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయారో ప్రజలు గుర్తించారు
* ప్రజలకు మంచి పాలన అందించాలి
* పాలకుర్తి నియోజకవర్గ నేతలతో మాజీ సీఎం కేసీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసొచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మళ్లీ భారాస అధికారంలోకి వస్తుందని, రావాలని కూడా ప్రజలు చెబుతున్నారని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ భారాస నేతలతో కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే 90 శాతం ఎక్కువే చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే అని తెలిపారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట పలువురు నేతలు వచ్చి కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
………………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
