* మళ్లీ మొదటికి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ..
ఆకేరున్యూస్, హైదరాబాద్: అన్ని జిల్లాల్లో కలిపి 90 వరకు స్పోర్ట్స్ కోటా పోస్టులుండగా.. డీఎస్సీ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. జీవో-74 ప్రకారం అన్ని అర్హతలున్న 33 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చారు. మిగిలిన పోస్టులను నాన్ స్పోర్ట్స్ కోటాలో జనరల్ అభ్యర్థులతో భర్తీచేశారు. దీంతో చాలా మంది అభ్యర్థులు తమకు అన్ని రకాల అర్హతలున్నాయని, అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించగా.. కొంతమంది స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో అభ్యర్థులందరి సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించాలని విద్యాధికారులు నిర్ణయించారు.
………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
