* విద్యార్థుల మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (REVANTHREDDY) అన్నారు. ఓటింగ్ వయసును 18 ఏళ్ల్ల ( 18 YEARS) కు తగ్గించిన క్రమంలో పోటీ చేసే వయసును కూడా తగ్గించే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఎన్సీఈఆర్టీలో విద్యార్థులు నిర్వహించిన అండర్-18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలంటే 25 ఏళ్లు నిండాలనే నిబంధన ఉంది. ఓటు హక్కు పొందేందుకు వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 18ఏళ్లకు తగ్గించారు.
కానీ, ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయడానికి 25 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధనను మాత్రం సవరించలేదు. ఈ నిబంధనను కూడా సవరించుకుని .. 21 ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలన్నారు. తద్వారా యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుందనా.. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పనిచేస్తున్నప్పుడు… 21 ఏళ్లు నిండిన వారు శాసనసభ్యులుగా కూడా రాణిస్తారన్నారు. మాక్ అసెంబ్లీ తీర్మానాల్లో ఈ అంశాన్ని కూడా చేర్చి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
