ఆకేరున్యూస్, తిరుమల: ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల శ్రీవారి హుండీలో చోరీ జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని శంకరన్ కోవిల్కు చెందిన వేణులింగం అనే యువకుడు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న స్టీల్ హుండీలో కొంత నగదు తస్కరించి పరారయ్యాడు. ఇదంతా హుండీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. గుర్తించిన భద్రతా సిబ్బంది అదే రోజు సాయంత్రం 6 గంటలకు పట్టుకుని భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించారు. విచారణ సందర్భంగా అతడి వద్ద రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
