Badrinath Traffic Jam
* 7 కి.మీ జామ్
ఆకేరు న్యూస్, డెస్క్: చార్ధామ్ యాత్ర రెండో దశలో భాగంగా బద్రీనాథ్‌కు భక్తులు, పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. దీంతో బద్రీనాథ్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగింది. జోషిమఠ్–మార్వారీ ప్రాంతాల మధ్య సుమారు 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు సమాచారం.
ట్రాఫిక్ జామ్‌కు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో బద్రీనాథ్ వైపు ప్రయాణిస్తున్న భక్తులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
లాంగ్ వీకెండ్‌తో పెరిగిన రద్దీ
లాంగ్ వీకెండ్‌తో పాటు మహాలయ పక్షాలు, హేమకుండ్ సాహిబ్ యాత్రకు భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రహదారిపై ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు కూడా ట్రాఫిక్‌కు కారణంగా ఉన్నట్లు సమాచారం.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు
భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. యాత్రికులు రహదారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణ ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
