Station Ghanpur Tree Fire
* దాయాదులపై బాధితుడి ఫిర్యాదు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంకు చెందిన కత్తుల కట్టయ్య అనే రైతు వ్యవసాయ క్షేత్రంలోని టేకు, మామిడి చెట్లను దగ్ధం చేశారు. చెట్ల దగ్ధంతో దాదాపు రూ. 1 లక్ష 50 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు కత్తుల కట్టయ్య దాయాదులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కట్టయ్య మాట్లాడుతూ నా గెట్టు నానుకొని మాదరబోయిన రమేష్ నిప్పు అంటించడం వల్ల 8 మామిడి చెట్లు, 11 టేక్ చెట్లు, 7 కొబ్బరి చెట్లు పూర్తిగా దగ్ధమై రూ. 1 లక్ష 50 వేల నష్టం వాటిల్లిందని. చెట్లను దగ్ధం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేకూర్చాలని పోలీసులను కోరారు.
ALSO READ :
Please tell us what is wrong. Your report will be sent to the website team.
