* రాజ్యసభకు అజిత్ పవార్ కొడుకు..??
ఆకేరు న్యూస్,మహారాష్ట్ర: అజిత్ పవార్ మరణానంతరం ఆయన వారసుడిగా పెద్ద కుమారుడు పార్థ్ పవార్ క్రియాశీల రాజకీయాల్లోకి పటిష్టంగా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, పార్థ్ పవార్‌ను రాజ్యసభకు పంపేందుకు ఎన్సీపీ (NCP)వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్రా పవార్, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సునేత్రా పవార్ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తే, ఆ ఖాళీ అయ్యే స్థానాన్ని పార్థ్ పవార్‌తో భర్తీ చేయాలని పార్టీ భావిస్తోంది.2019 లోక్‌సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన పార్థ్ పవార్‌కు, ఇది పెద్ద పొలిటికల్ బ్రేక్ కానుంది.అజిత్ పవార్ లేని లోటును భర్తీ చేస్తూనే, కుటుంబ పట్టును నిలబెట్టుకోవడం మరియు యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
…………………………………………….
