India A won against Sri lanka A ODI cricket
ఆకేరు న్యూస్, డెస్క్: గెలుపు దాదాపు శ్రీలంక-ఏ (Srilanka A) చేతుల్లోకి వెళ్లిపోయింది. చివరి 12 బంతుల్లో కేవలం 10 పరుగులే అవసరం. చేతిలో మూడు వికెట్లు కూడా ఉన్నాయి. మ్యాచ్ ముగిసిందని అందరూ భావించిన వేళ.. భారత్-ఏ (India A) అద్భుతంగా పుంజుకుని ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది.
* రుతురాజ్ సెంచరీ..
మొదట బ్యాటింగ్ చేసిన భారత్-ఏ 50 ఓవర్లలో 277/6 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులతో సెంచరీ సాధించి ఇన్నింగ్స్‌కు అండగా నిలిచాడు. కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులతో కీలక భాగస్వామ్యం అందించాడు.
చివర్లో సూర్యాన్ష్ షెడ్గే 26 పరుగులతో మెరవడంతో భారత్ పోటీ స్కోరు నమోదు చేసింది.
* గెలుపు దిశగా శ్రీలంక-ఏ
278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక-ఏకు డిక్వెల్లా (47), అవిష్కా ఫెర్నాండో (45) మంచి ఆరంభం అందించారు. అనంతరం కెప్టెన్ సహన్ అరాచ్చిగే 74 పరుగులతో జట్టును విజయానికి చేరువ చేశాడు.
262/7 స్కోరు వద్ద ఉన్న శ్రీలంక-ఏకు చివరి రెండు ఓవర్లలో 10 పరుగులే అవసరం కావడంతో మ్యాచ్ పూర్తిగా వారి వైపే కనిపించింది.
* మ్యాచ్ మలుపు తిప్పిన కంబోజ్
అలాంటి సమయంలో అన్షూల్ కంబోజ్ కీలక వికెట్‌తో భారత్‌కు బ్రేక్‌థ్రూ అందించాడు. సెట్ అయిన కెప్టెన్ సహన్ అరాచ్చిగేను పెవిలియన్ చేర్చి మ్యాచ్ గమనాన్ని ఒక్కసారిగా మార్చేశాడు.
ఆ వికెట్ తర్వాత శ్రీలంక బ్యాటర్లపై ఒత్తిడి పెరిగి వరుస తప్పిదాలు జరిగాయి.
* చివర్లో భారత్ అద్భుత కంబ్యాక్
కంబోజ్ వికెట్ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ చేసిన కీలక రనౌట్ శ్రీలంక ఆశలకు గట్టి దెబ్బ కొట్టింది.
ఏడు పరుగుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక-ఏ 269 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్-ఏ 8 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది.
ఓటమి అంచుల నుంచి అద్భుతంగా తిరిగి వచ్చిన భారత్-ఏ.. ముక్కోణపు సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది.
ALSO READ :-
