* సాగర్ జలాశయంలో పడి ఐదుగురు యువకులు మృతి
* అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
* దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశాలు
ఆకేరున్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. వీకెండ్ కావడంతో పర్యటనకు వచ్చి కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో పడి ఐదుగురు యువకులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు ఈ రోజు ఉదయం కొండపోచమ్మ సాగర్ చూసేందుకు రాగా.. వాళ్లందరూ డ్యామ్‌లో పడి గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటికే ఐదుగురు యువకులు మరణించారు. మిగిలిన ఇద్దరిని సురక్షితంగా కాపాడారు. మృతులను ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జనిత్గా గుర్తించారు. కాగా.. యువకుల గల్లంతు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వివరాలు ఆరా తీశారు. దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
