ఆకేరు న్యూస్ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలో చేరుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్న బీజేపీ నేత కేంద్రమంత్రి అమిత్ షాను బేగంపేట ఎయిర్ పోర్టులో కలిసినట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీలో చేరికపై ఆయనతో కొద్దిసేపు ఆరూరి చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఆరూరి రమేశ్ చవి చూశాడు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బీఆర్ ఎస్ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. బీఆర్ ఎస్ అధిష్టానం మాత్రం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్యను బరిలోకి దించేందుకు మొగ్గు చూపినట్లుగా తెలిసింది. దీంతో ఆరూరీ రమేశ్ కొద్ది రోజుల క్రితమే బీజేపీలోకి వెళ్ళేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బీఆర్ ఎస్ నేతలు కేటీఆర్ , హరీశ్ రావులు బుజ్జగించడంతో మనసు మార్చుకున్నట్లుగా తెలిసింది. వరంగల్ పార్లమెంట్ సీటు కూడా ఆరూరికే ఇస్తామని హామి ఇచ్చినట్లుగా తెలిసింది. ఆరూరి రమేశ్ తిరిగి బీఆర్ ఎస్‌లో కొనసాగడం ఇష్టం లేని వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు సహ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆరూరి రమేశ్ మరోసారి కమలం పార్టీలో చేరేందుకు సిద్దమయినారు. అమిత్ షాతో చర్చల అనంతరం ఢిల్లీలో బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది..
————————————————————–
Related Stories
November 10, 2024
November 10, 2024
3 thoughts on “బీజేపీలోకి ఆరూరి రమేశ్ .. బేగంపేటలో అమిత్ షాను కలిసిన రమేశ్”