ఆకేరు న్యూస్, వరంగల్ : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్ రావు (Sudhakar Rao) తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్య తో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందారని బంధువులు తెలిపారు. సుధాకర్‌రావు మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వైద్యుడిగా, ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన ప్రజా సేవను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుధాకర్‌రావు మృతి బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
డాక్టర్ సుధాకర్‌రావు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1969లో విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి జనగామలో అరెస్టయ్యారు. అనంతరం వైద్య విద్యను అభ్యసించి సామాన్య జనానికి వైద్య సేవలందించారు. ఎండోక్రైనాలజిస్టుగా పలు సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సుధాకర్ రావు .. 1999లో పాలకుర్తి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2010లో టీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2014 నాటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. చివరగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్‌గా సేవలందించారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సుధాకర్‌రావు.. ఇటీవల యశోద ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాసవిడిచారు. ఇక సుధాకర్‌రావు తండ్రి యెతి రాజారావు మంత్రి గా, తల్లి విమలాదేవి చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
