YSR Jayanti Station Ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లిలో అభ్యుదయ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అభ్యుదయ యువజన సంఘం నియోజకవర్గ కన్వీనర్ పోశాల కృష్ణ, మేకల మల్లేష్, నోముల జైపాల్ రెడ్డి, షేక్ జానీ బాబాతో పాటు పలువురు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభ్యుదయ యువజన సంఘం నియోజకవర్గ కన్వీనర్ పోశాల కృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రతి పేదవాడికి 108 సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్, జల యజ్ఞం, ఆరోగ్యశ్రీ సేవలు, రైతుల ఉచిత విద్యుత్, వృద్ధులకు పెన్షన్స్ లు అందించి మరపురాని నేతగా తెలుగు రాష్ట్రాలలో చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి వైయస్సార్ అన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
