Published:
Updated: 26 Nov 2024 • 04:12 AM
* లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇరిగేషన్ ఏఈ
ఆకేరు న్యూస్, పెద్దపల్లి : పెద్దపల్లి కలెక్టరేట్(PEDDAPALLI COLLECTARATE) లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా, ఇరిగేషన్ ఏఈ(IRIGATION AE) నర్సింగరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆయన కార్యాలయంలో, ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముందస్తు సమాచారం ప్రకారం కలెక్టరేట్ కు చేరుకున్న ఏసీబీ(ACB) అధికారులు పక్కా సమాచారంతో ఏఈపై నిఘా పెట్టారు. లంచం డబ్బు తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారుల సోదాలతో కలెక్టరేట్ లో కలకలం రేగింది.
……………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
