Actress Jyothika Salary Compared to Suriya
* జ్యోతిక ఆసక్తికర వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, డెస్క్: దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక జ్యోతిక. ‘ఠాగూర్’, ‘మాస్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలైన ఆమె, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ రోజులు మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
జ్యోతిక తన పారితోషికం పోలిక గురించి మాట్లాడుతూ జ్యోతిక నవ్వుతూ స్పందించారు. “మా ఇద్దరి కెరీర్ ప్రారంభంలో సూర్య కంటే నా పారితోషికమే మూడు రెట్లు ఎక్కువగా ఉండేది. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారాయి, ఇప్పుడు ఆయన అందుకుంటున్న పారితోషికంతో పోలిస్తే నాది చాలా తక్కువ” అని పేర్కొన్నారు.
* సమానత్వానికి పీట వేసే వ్యక్తి..
తన భర్త సూర్య వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ.. “సూర్యలో మొదటి నుంచీ సమానత్వ భావన ఉంది. నేనేదో ప్రత్యేకంగా చెబుతున్న మాటలు కావివి. మా ఇంట్లో ఇద్దరికీ సమాన హక్కులుంటాయి. నిర్మాణ బాధ్యతల నుంచి పిల్లల పెంపకం, విహారయాత్రల ప్లానింగ్ వరకు అన్ని నిర్ణయాలూ ఇద్దరం కూర్చొని ఉమ్మడిగానే తీసుకుంటాం” అని జ్యోతిక వివరించారు
* రీల్ టు రియల్ లైఫ్ జోడీ…
‘పూవెల్లం కేట్టుప్పార్’ చిత్రంతో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి, 2006 సెప్టెంబర్ 11న వివాహబంధంగా మారింది. వెండితెరపైనే కాక నిజ జీవితంలోనూ ఈ జంట ఆదర్శంగా నిలుస్తోంది.
* ఇద్దరి తాజా చిత్రాలు…
ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్లు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. జ్యోతిక కీలక పాత్రలో నటించిన లీగల్ డ్రామా ‘సిస్టమ్’ నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాగా, సూర్య కథానాయకుడిగా రూపొందిన ‘వీరభద్రుడు’ (కరుప్పు) బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనతో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
