Amberpet Bonalu 2026
* బోనాలకు సిద్ధమైన కాలనీలు
* సర్వాంగ సుందరంగా ముస్తాబైన మహాకాళి ఆలయం
* ప్రత్యేక ఆకర్షణగా చప్పల్‌బజార్ ఉత్సవాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
బోనాల ఉత్సవాలకు మహానగరం ముస్తాబవుతోంది. బస్తీలు, కాలనీలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల బోనాలు కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల ముగిశాయి. ఈ వారం మరిన్ని ప్రముఖ ఆలయాలు బోనాల వేడుకలకు సిద్ధమవుతున్నాయి. అలాంటి వాటిలో ప్రముఖమైనవి అంబర్‌పేట, నింబోలీ అడ్డాలోని మహంకాళి దేవాలయాలు. గోల్కొండ, సికింద్రాబాద్, పాతబస్తీ బోనాల తర్వాత ఇక్కడి బోనాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆది, సోమవారాల్లో జరిగే బోనాల కోసం స్థానికులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.
* విద్యుత్ ధగధగలు
బోనాల ఉత్సవాల నేపథ్యంలో నిర్వాహకులు రంగురంగులతో, విద్యుత్‌దీపాలతో అంగరంగవైభవంగా తీర్చిదిద్దారు. నియోజకవర్గంలో ఏబస్తీలలో చూసిన బోనాల ఉత్సవాల సందడితో కళకళలాడుతున్నాయి. పలు బస్తీలలో అమ్మవారి పాటలతో హోరేత్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీలను, బ్యానర్లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో అంబర్‌పేట మహంకాళి దేవాలయం, నింబోలి అడ్డా మహంకాళి దేవాలయాలలో భారీఎత్తున బోనాల ఉత్సవాలు జరుగుతాయి.
* ఫలహారబండ్ల ఊరేగింపులు
అంబర్‌పేట నియోజకవర్గంలోని ఒక్కో ఏరియాకు ఒక్కో ప్రత్యేక ఉంది. నింబోలి అడ్డా, అంబర్‌పేట, నల్లకుంట తదితర ప్రాంతాల్లో బోనాలు ఘనంగా జరిగితే, చప్పల్‌బజార్‌లో ఫలహారం బండ్ల ఊరేగింపు ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అమ్మవారి బోనాల ఉత్సవాలకు సి.లడ్డుయాదవ్, కన్నె రమేష్యాదవ్లు వేర్వేరుగా భారీ ఏర్పాట్లు అలంకరణలు చేసి ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఆకర్షణీయంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చప్పల్‌బజార్‌లో జరిగే ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అక్కడ విద్యుత్ దీపాలతో చేసే అలంకరణను ప్రత్యేకంగా తిలకించడానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తారు.
* బస్తీల్లో సందడి
నియోజకవర్గంలోని అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట, నల్లకుంట, కాచిగూడ డివిజన్లలోని బస్తీలన్ని బోనాల ఉత్సవాలకు ముస్తాబై కళకళలాడుతున్నాయి. ఏబస్తీలో చూసినా ఆ సందడి కనిపిస్తోంది. అంబర్‌పేట మహంకాళి దేవాలయం వద్ద ఉత్సవాలకు దేవస్థాన సేవా సమితి వారు భారీ ఏర్పాట్లను చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అంబర్‌పేట మహంకాళి దేవాలయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించనున్న దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
* నియోజకవర్గంలో మరిన్ని ప్రముఖ ఆలయాలు
* అంబర్‌పేట సీపీఎల్ రోడ్డు తిరుమనగర్లోని రేణుకాఎల్లమ్మ
* నాగదేవత దేవాలయం
* గోల్నాక డివిజన్లోని శాంతినగర్‌లోని శ్రీపోచమ్మదేవాలయం
* గంగానగర్‌లోని శ్రీమహంకాళి
* బంగారుమైసమ్మ దేవాలయాలు
* గోల్నాక శ్రీలక్ష్మినగర్లోని శ్రీదేవీ నల్లపోచమ్మ దేవాలయం
* దుర్గానగర్‌లోని దుర్గామైసమ్మ దేవాలయం
* మారుతీనగర్, అన్నపూర్ణనగర్ అమ్మవారి ఆలయం
* ఖాద్రీబాగ్, కృష్ణానగర్, కామ్గార్నగర్, సంజయ్‌గాంధీనగర్, సుందర్‌నగర్, నెహ్రూనగర్, ఆలయాల్లో ఘనంగా ఉత్సవాల నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
