Chityala Fatal Road Accident
అకేరు న్యూస్ నల్గొండ జిల్లా: చిట్యాల 65వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విజయవాడ మీదుగా హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు. కారు పెద్దకాపర్తి శివారు ప్రాంతానికి చేరుకోగానే, వెనుక నుండి అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను గ్యాస్ కట్టర్ల సాయంతో అత్యంత శ్రమతో బయటకు తీశారు. మృతుల వద్ద లభించిన ఐడెంటిటీ కార్డులు, ఆధారంగా వారు కాకినాడ వాసులుగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
