Chandrababu Review AP Heavy Rain Alert
* సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
ఆకేరు న్యూస్, అమరావతి : బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేకంగా అప్రమత్తత చర్యలు చేపట్టాలని సూచించారు.
రాష్ట్రంలోని 7 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరో 7 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
జిల్లాల వారీగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లు, ఉన్నతాధికారులకు చంద్రబాబు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సహాయక చర్యలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
