మానవత్వం చాటుకున్న కేటీఆర్
ఆకేరు న్యూస్, వరంగల్ : ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చొరవ చూపారు. మరోసారి మానవత్వం చాటారు. ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తిని తన ఎస్కార్ట్ కారులో హాస్పిటల్‌కు తరలించారు. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య (55) అనే వ్యక్తి ప్రమాదానికి గురై రోడ్డుపై కిందపడి ఉన్నాడు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం అటుగా నర్సంపేటకు వెళ్తున్న కేటీఆర్ అతన్ని చూసి వెంటనే కారు దిగారు. తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం అతడికి తక్షణ చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. సకాలంలో స్పందించి బాధితుడికి అండగా నిలిచిన కేటీఆర్‌ను పలువురు ప్రశంసించారు. నెటిజన్లు పొగడ్తలతో నింపుతున్నారు.
———————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
