Ayush Medical students Protest Over Stipend Hike
* ఆయుష్ వైద్య వైద్యార్థుల ఆందోళన
* పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్న
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా చేస్తున్న నిరసనలు చేస్తే పట్టించుకోరా అంటూ ఆయుష్ వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ నిరసనలకు పోలీసులు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రులకు తమ బాధను పోస్టు కార్డు ద్వారా తెలియచేస్తాం అంటే ఎందుకు అనుమతులు ఇవ్వట్లేదని ప్రశ్నించారు.
* వంటావార్పు.. ఉధృతం
స్టైఫండ్ పెంపు కోరుతూ కొద్ది రోజులుగా తెలంగాణలోని ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. వంటావార్పు, ర్యాలీలతో తమ నిరసనలు చేపడుతున్నారు. హైదరాబాద్లోని రామంతాపూర్ జేఎస్పీఎస్ హోమియోపతి మెడికల్ కాలేజ్, ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి, వరంగల్లోని అనంతలక్ష్మి ఆయుర్వేద కాలేజీలతో పాటు పలు ప్రాంతాల్లో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు.
* ప్రధాన డిమాండ్లు ఇవే..
అల్లోపతి హౌస్ సర్జన్లకు ఇస్తున్నట్లుగానే తమకూ సమానంగా స్టైఫండ్ పెంచాలని జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. గత పదేళ్లుగా తమ స్టైఫండ్ లో మార్పు లేదని వాపోతున్నారు. అద్దెలు, నిత్యావసరాల ధరలు విపరీతంఆ పెరిగినా స్వల్ప స్టైఫండ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి పెరగాల్సిన స్టైఫండ్ పెంపు జీవో జారీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు
* పోస్టుకార్డు ఉద్యమానికి నిరాకరణ
తమ బాధలను పోస్టుకార్డు ద్వారా ప్రభుత్వ పెద్దలకు తెలియజేద్దామంటే పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రెండురోజులుగా ఈ కార్యక్రమం వాయిదా పడుతోందన్నారు. రెండు కిలోమీటర్ల ర్యాలీ గా వెళ్ళి ఎస్ ఆర్ నగర్ పోస్టు ఆఫీసులో పోస్టుకార్డులు వేయడానికి కూడాఅనుమతులు ఇవ్వకపోవడం దారుణమని వాపోతున్నారు. దీని ద్వారా శాంతియుతంగా చేసే నిరసనలకు లెక్కే లేదనే సూచన వెళ్తుందని అంటున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
