India ODI Squad England Series, Kohli and Bumrah returns
* ఇంగ్లాండ్ వన్డేలకు టీమిండియా జట్టు ప్రకటన
* కోహ్లీకి చోటు, జైశ్వాల్‌కు షాక్!
ఆకేరు న్యూస్, డెస్క్:
ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. గాయం నుంచి కోలుకుంటున్న విరాట్ కోహ్లీకి జట్టులో చోటు దక్కినా.. ఫిట్నెస్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే మ్యాచ్‌లు ఆడనున్నాడు.
* కోహ్లీకి గ్రీన్ సిగ్నల్.. హార్దిక్ అవుట్
వన్డేల్లోకి తిరిగి రానున్న కోహ్లీపై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరోవైపు గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.
* సెంచరీ చేసినా ఛాన్స్ లేదు
అఫ్ఘానిస్థాన్‌తో మూడో వన్డేలో 110 పరుగులతో అజేయ సెంచరీ చేసిన యశస్వి జైశ్వాల్‌కు ఈసారి జట్టులో చోటు దక్కలేదు. జట్టులో తీవ్ర పోటీ కారణంగా సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
* బుమ్రా రీఎంట్రీ..
విశ్రాంతి తర్వాత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. యువ పేసర్లు హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్‌లకు అవకాశం లభించింది. మరోవైపు మహ్మద్ సిరాజ్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.
🚨 News 🚨
India’s ODI squad for the England tour announced.
𝗡𝗢𝗧𝗘: Varun Chakaravarthy has been ruled out of the Ireland T20I Series as he continues his rehab at the BCCI COE.
More Details ▶️ https://t.co/wOdXTQqJto #TeamIndia | #ENGvIND pic.twitter.com/t0GypgM4kp
— BCCI (@BCCI) June 21, 2026
* ఇంగ్లాండ్ సిరీస్‌కు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్.
* సిరీస్ షెడ్యూల్
జులై 14 – తొలి వన్డే, బర్మింగ్‌హామ్
జులై 16 – రెండో వన్డే, కార్డిఫ్
జులై 19 – మూడో వన్డే, లార్డ్స్
2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల దృష్ట్యా ఈ సిరీస్ భారత జట్టుకు కీలకంగా మారింది. గిల్ నాయకత్వంలో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి.
