
భరత్ భూషణ్
* దిల్ రాజు పదవీకాలం ముగియడంతో ఎన్నికలు
* ఉపాధ్యక్షుడిగా నిర్మాత అశోక్ కుమార్ ఎన్నిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber of Commerce) (టీఎఫ్ సీసీ) అధ్యక్షుడి (President) గా భరత్ భూషణ్ (Bharat Bhushan) ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్ దిల్ రాజు (Dil Raju) పదవీకాలం ముగియడంతో నేడు ఎన్నికలు నిర్వహించారు. నిర్మాతలు, స్టూడియోల యజమానులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. విశాఖ (Visakha) కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ (Famous Distributor) భరత్ భూషణ్ తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈసారి ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి భరత్ భూషణ్, ఠాగూర్ మధు (Tagore Madhu) (నెల్లూరు) పోటీ పడ్డారు. భరత్ భూషణ్ కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు వచ్చాయి. ఇక, తెలుగు ఫిలిం చాంబర్ ఉపాధ్యక్షుడిగా నిర్మాత అశోక్ కుమార్ (Ashok Kumar) గెలిచారు. ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి (YVS Chowdhary) మధ్య పోటీ జరిగింది. అశోక్ కుమార్ కు 28 ఓట్లు, వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు లభించాయి.
—————-