* గోడమీద పిల్లి ఎంఐఎం
* అధికారంలో ఎవరు ఉంటే వారి వెంటే
* కేంద్ర మంత్రి బండి సంజయ్
* లాల్ దర్వాజా అమ్మవారి దర్శనానికి రాక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (MIM MLA Akbaruddin Owaisi) కాంగ్రెస్ పార్టీ (Congress party) లో చేరితే, డిప్యూటీ సీఎంను చేసి పక్కన కూర్చోపెట్టుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి (Union Minister), కరీంనగర్ ఎంపీ బండ సంజయ్ (Karimnagar MP Banda Sanjay) స్పందించారు. రేవంత్ (Rewant), అక్బరుద్దీన్ (Akbaruddin) అన్నదమ్ములైపోయారని ఎద్దేవా చేశారు. గోడమీద పిల్లి ఎంఐఎం పార్టీ అని, అధికారంలో ఎవరు ఉంటే వారి వెంటే ఉంటుందని విమర్శించారు. లాల్ దర్వాజా బోనాల (Lal Darwaja Bonala) నేపథ్యంలో చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి సంజయ్ (Sanjay) ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అక్బరుద్దీన్‌ను డిప్యూటీ సీఎం (Deputy CM) చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. దమ్ముంటే అక్బరుద్దీన్ కొడంగల్ (Kodangal) నుంచి పోటీచేయాలని, డిపాజిట్ కూడా రాకుండా చేస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ(BJP) అధికారంలో రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తామని తెలిపారు. తాను హిందువుల తరపున పక్కా మాట్లాడుతానని, అయితే ఇతర మతాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
————–