* హైజాక్ చేస్తామని దుండగుల హెచ్చరిక
* తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు
ఆకేరున్యూస్ డెస్క్ : బాంబు బెదిరింపులతో విమానయాన సంస్థలతో పాటు ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కువైట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శుక్రవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. అయితే, విమానంలోని వాష్‌రూమ్‌లో ఓ టిష్యూ పేపర్ మీద ‘విమానంలో బాంబు ఉంది, హైజాక్ చేస్తాం’ అని రాసి ఉండటాన్ని ఫ్లైట్ క్రూ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం వెంటనే ఫ్లైట్‌లోని ప్రయాణికులందరినీ కిందకు దించి, భద్రతా దళాలు, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి.
………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
