ఆకేరు న్యూస్, వరంగల్: మాజీ గవర్నర్, బండారు దత్తాత్రేయ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు.మొక్కులలో భాగంగా బండారు దత్తాత్రేయ అమ్మవారికి తులాభారం చెల్లించుకున్నారు. తన బరువుకు సమానమైన బంగారాన్నిఅమ్మవారికి సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మికత గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.దత్తాత్రేయ రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. అభిమానులు, స్థానిక నేతలు ఆయనను కలిసేందుకు ఆసక్తి చూపారు.
…………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
