Bonalu Cheque Distribution Turns Chaotic in Secunderabad Amid Political Clash
* బోనాల చెక్కుల పంపిణీ వివాదాస్పదం
* సికింద్రాబాద్లో బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్
* సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బోనాల సందర్భంగా ఆలయాలకు ప్రభుత్వం అందించే నిధుల పంపిణీలో కొన్నిచోట్ల గందరగోళాలు ఏర్పడుతున్నాయి. చెక్కుల పంపిణీ వివాదాస్పదంగా మారుతోంది. తక్కువ నిధులు ఇచ్చారని కొన్నిచోట్ల జరుగుతుంటే, మరికొన్ని చోట్ల ప్రొటోకాల్ వివాదాలు ఘర్షణకు దారి తీస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్ నియోజకవర్గం మధురనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో జరిగిన బోనాల చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించ లేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ చెలరేగింది.
* వివాదానానికి కారణమిదే..
సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మధురనగర్ కమ్యూనిటీ హాల్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ హాజరయ్యారు. చెక్కుల పంపిణీ సందర్భంగా కాంగ్రెస్ సికింద్రాబాద్ ఇన్ చార్జి ఆదం సంతోష్ కూడా వేదిక ఎక్కారు. దీంతో వివాదం మొదలైంది. ప్రొటోకాల్ లేకుండా ఆయన ఎలా స్టేజీ ఎక్కుతారని బీఆర్ ఎస్ మాజీ కార్పొరేటర్లు ఆందోళన మొదలుపెట్టారు. వాళ్లు కూడా వేదిక ఎక్కేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన చేపట్టారు..
* దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ ఎస్ మాజీ కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం.. అని నినాదాలు చేశారు. సీఎం డౌన్.. డౌన్.. అంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారిక ఉత్సవాల నిర్వహణలో చోటుచేసుకున్న రాజకీయ విభేదాలు రచ్చకెక్కడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక కార్పొరేటర్లను, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులను అధికార పక్షం అవమానిస్తోందని ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకరికొకరు నెట్టేసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ వివాదాల నడుమే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీ మొదలుపెట్టారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
