Dr T Rajaiah BRS, Women question Congress Promises
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
తులం బంగారం ఏది ? నెలకు 2500లు ఎక్కడ అని బిఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, నాగూర్ల వెంకన్న, మోతే స్వరూపలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలలో బిఆర్ఎస్ పార్టీ మహిళా సదస్సు శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఇస్తానన్న రూ. 2500లు, విద్యార్థినిలకు స్కూటీ, తులం బంగారం ఏదని మహిళలు నిలదీశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల మోసపు పాలనపై బిఆర్ఎస్ నాయకులు మహిళలు ధ్వజమెత్తారు, అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మోతే స్వరూప, నాగూర్ల వెంకన్న డాక్టర్ రాజయ్యలు మాట్లాడుతూ మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు ఏవని నిలదీశారు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీ, పూసే లేదని ఎద్దేవా చేశారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేసే కుట్ర పన్నుతున్నరన్నారు, ఇంటింటికి గ్యారంటీ కార్డులు ఇచ్చి ప్రజలను మోసం చేశారనీ, మహిళలకు వృద్ధులకు, వికలాంగులకు, ఇస్తానన్న హామీలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ పడిందని బాకీ కార్డులను ప్రదర్శించారు.
కార్యక్రమంలో మాలోతు రమేష్ నాయక్, చేవెళ్ల సంపత్ కుమార్, రాజన్ బాబు, ఊడుగుల భాగ్యలక్ష్మి, కే సి రెడ్డి మనోజ్ రెడ్డి, కర్ర సోమిరెడ్డి, మంతెన రాజు, కళకుల చుక్కయ్య, నీలం సుధాకర్, జ్యోతి రెడ్డి, ఏన్నం మాధవరెడ్డి, చిలుపూరు ఉపసర్పంచ్ రాజారపు రంజిత్ కుమార్ వార్డు సభ్యులు రాజు, మహేందర్, భాగ్య, కోమల, సంపత్, కుమారస్వామి గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు మహమ్మద్ రాజ్ మహమ్మద్, మాచర్ల ప్రవీణ్ కుమార్ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
