RTC SHANKAR GOUD NARSAMPET
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
నర్సంపేటలో డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నిరసనగా, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతూ బిఆర్ఎస్ చిల్పూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో
శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆదేశాల మేరకు మండల పార్టీ ఇంచార్జి మాలోతు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో చిల్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో నిన్న డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని చనిపోయిన సందర్బంగా ఆర్టీసీ కార్మికులకు మద్దత్తు ప్రకటించారు. శంకర్ కుటుంబనీకి ఒక కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా, కుటుంబనీకి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం చిల్పూర్ తాసిల్దార్ మనవి ప్రత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, చిల్పూర్ ఉప సర్పంచ్ రాజరాపు రంజిత్, నారగోని రాజు, శ్రీను, మాజీ సర్పంచ్ దివాకర్ రెడ్డి, గ్రామ ప్రధాన కార్యదర్శి విష్ణు రాజు, సాధం రఘు, ఉపేందర్, నలిమేలా కుమార్, గ్రామ అధ్యక్షులు ఉమ్లా, పల్లె అంజ్జి, రాజు, విజయ్, క్రాంతి, దేవేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
