కేటీఆర్
– దీన్నే దయగల ప్రభుత్వం అంటారు
– ఓ ఎక్స్ యూజర్ పెట్టిన పోస్టుపై స్పందించిన కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ ప్రభుత్వం (BRS Government) అధికారంలో ఉన్న పదేళ్లలో రైతుల జీవితాలు మెరుగుపడ్డాయని, తెలంగాణ సస్యశ్యామలం అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. తెలంగాణలో 2015 నుంచి 2022 వరకు రైతుల ఆత్మహత్యలు ఎలా తగ్గుతూ వచ్చాయో తెలిపే గణాంకాలకు సంబంధించిన ఒక గ్రాఫ్‌ను జూన్ 24న అర్వింద్ వారియర్ (Arvind Warrier) అనే ఒక ఎక్స్ (X) యూజర్ తన ఎక్స్ ఖాతాలోని పోస్టును కోట్ చేస్తూ తాజాగా కేటీఆర్(KTR) తన ఎక్స్ (X) అకౌంట్లో కొత్త పోస్టు పెట్టారు. వాటిని రీట్వీట్ (Retweet) చేశారు. దేశంలోని రైతు ఆత్మహత్యల్లో 2015లో తెలంగాణ రైతుల వాటా 11.1 శాతంగా ఉండేదని, ఆ శాతం క్రమం తగ్గుతూ 2022 నాటికి 1.57 శాతానికి చేరిందనే విషయాన్ని ఆ గ్రాఫ్ స్పష్టం చేస్తున్నదని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రైతుల జీవితాలు ఎలా మెరుగుపడ్డాయో వివరించారు.
2014కు ముందు ఎక్కడ చూసినా బీడు భూములే
‘2014కు ముందు తెలంగాణ ప్రాంతం దేశంలోని తీవ్ర కరువు కాటకాలు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఒకటిగా ఉండేది. సాగునీటి సౌకర్యం లేక ఎక్కడ చూసినా బీడు భూములే దర్శనమిచ్చేవి. అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పులపాలై పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం చొరవ తీసుకుని, చిత్తశుద్ధితో తెలంగాణ(Telangana)లో వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేసింది. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం కృషితో క్రమంగా వ్యవసాయ రంగం గాడినపడింది. వ్యవసాయంలో నాణ్యత పెరిగింది. రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయి. అందుకు ఈ కింద ఉన్న గణాంకాలే నిదర్శనం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పోస్టుకు ‘దీన్నే దయగల్ల ప్రభుత్వం అంటరు’ అనే టైటిల్ ఇచ్చారు.
——————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
