* ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం తీపి కబురు..
ఆకేరున్యూస్, అమరావతి : రూ.2.245 కోట్లతో 57 కి.మీ కొత్త రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆంధ్ర ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించారు. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కత్తాకు అనుసంధానిస్తూ కొత్త రైల్వేలైన్‌ను ఏర్పాటు చేస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడిరచారు.
ఈ రైల్వేలైన్ ద్వారా కాజీపేట మీదుగా నాగ్‌పూర్, ఢల్లీి వరకు అమరావతికి అనుసంధానం ఉంటుందని పేర్కొన్నారు. అమరలింగేశ్వర స్వామి, ధ్యానబుద్ధ, అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి సులువైన మార్గంగా రైల్వేలైన్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రైల్వే లైన్‌ద్వారా దక్షిణ, మధ్య, ఉత్తర భారత్‌తో అనుసంధానం మరింత సులువు అవుతుందని పేర్కొన్నారు. అదే విధంగా కృష్ణానదిపై 3.2 కి.మీ పొడవైన కొత్త రైల్వే వంతెన నిర్మాణం చేపడుతామని ప్రకటించారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
