CEO Sudharshan Reddy Fake Election Messages
* మోసపూరిత సందేశాలు వస్తున్నాయని వెల్లడి
* స్పందించవద్దని సూచన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ECI పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు వస్తున్నాయని ప్రజలను అలర్ట్ చేశారు. వాటికి స్పందించవద్దని సూచించారు. హైదరాబాద్ బీఆర్కే భవన్ లో సర్ డిజిజలైజేషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటర్లకు కొన్ని సూచనలు చేశారు.
* ఆ కాల్స్ కు స్పందించొద్దు
ఓటర్ వివరాలు సరిపోలడం లేదంటూ ప్రజలకు ఫేక్ మెసేజ్‌లు వస్తున్నట్లు తాము గుర్తించామని సీఈఓ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఫేక్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించొద్దు అని తెలిపారు. అటువంటి మెసేజ్ లు, ఫోన్ కాల్స్ ఈసీఐ, సీఈఓ కార్యాలయం నుంచి రావని తెలిపారు. ఆ తరహా మోసపూరిత సందేశాలు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
* సైబర్ నేరగాళ్లు కావొచ్చు..
అటువంటి మెసేజ్ లు, మోసపూరిత వాట్సాప్ సందేశాలు పంపేది సైబర్ నేరగాళ్లు కావొచ్దని హెచ్చరించారు. మీ ఓటరు కార్డ్ రద్దయింది, ఓటరు జాబితాలో వివరాలు అప్డేట్ చేయకపోతే ఓటు హక్కు పోతుంది.. అని ఈసీఐ పేరుతో వస్తే నమ్మి పోసవద్దన్నారు. నకిలీ ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేస్తే ఫోన్లోని వ్యక్తిగత డేటా, బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని తెలిపారు. ఆన్ లైన్ లింకులతో జాగ్రత్తగా ఉండాలన్నారు.
* అధికారిక సైట్లనే వినియోగించండి
ఓటర్లు ఎటువంటి సమాచారమైనా అధికారిక వెబ్ సైట్ ద్వారా చేసుకోవాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. ఓటరు కార్డులో సవరణలు, కొత్తగా పేరు నమోదు, వివరాల తనిఖీ కోసం కేవలం అధికారిక పోర్టల్ voters.eci.gov.in లేదా Voter Helpline App లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఎన్నికల సంఘం నేరుగా డబ్బులు అడగదు: ఎన్నికల కమిషన్ ఎన్నటికీ ఓటర్లకు నేరుగా ఎస్ఎమ్ఎస్లు పంపి ఓటరు కార్డు అప్ డేట్ కోసం డబ్బులు లేదా పిన్ నంబర్లు అడగదని సీఈఓ స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
