* హుస్సేన్‌సాగర్ వద్ద భారీ బందోబస్తు
* ఖైరతాబాద్, లక్డీకాపూల్‌లో భారీగా ట్రాఫిక్
హైదరాబాద్, ఆకేరు న్యూస్: గణనాథుల నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని వందల గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు బారులు తీరడంతో ఖైరతాబాద్, లక్డీకాపూల్, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. ఈ క్రమంలో పోలీసుల భారీ బందొబస్తుతో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువ కావడంతో ఉద్యోగులు, ఇతరులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు.అలాగే నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేయాలని, బుధవారం మధ్యాహ్నం వరకు నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు 1,02,510 గణనాథుల విగ్రహాల నిమజ్జనం జరిగిందని, గ్రేటర్ వ్యాప్తంగా 71 ప్రాంతాలలో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయని గ్రేటఱ్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
