* రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి
* 20 శాతం తగ్గిన డ్రంకెన్ డ్రైవ్ కేసులు
* నేర వార్షిక నివేదిక – 2025 విడుదల చేసిన సీపీ సజ్జనార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈ ఏడాది నేరాలు హైదరాబాద్ (Hyderabad) లో15 శాతం తగ్గాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) వెల్లడించారు. నేర వార్షిక నివేదికను సజ్జనార్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ కవచ్, డ్రోన్ల వినియోగంలో ముందున్నామని తెలిపారు. డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్ ఫోర్స్మెంట్ విభాగం చాలా సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించామని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ అన్నారు. తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఇతర రాష్ట్రాల నేరగాళ్లు భయపడుతున్నారని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్ ఫీ సొసైటీ (Drug-free society) కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ముఖ్యమైన అంశాలు ఇలా..
* ఈ ఏడాది నేరాలు 15 శాతం తగ్గాయి.
* ఈ ఏడాది మహిళలపై నేరాలు 6 శాతం తగ్గాయి.
* రోడ్డు ప్రమాదాల సంఖ్య 3058 నుంచి 2678కు తగ్గాయి.
* డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్య 20 శాతం తగ్గింది.
* గతేడాది అత్యాచార కేసులు 484 నమోదైతే ఈ ఏడాది 405 నమోదయ్యాయి.
* కిడ్నాప్ కేసులు గతేడాది 324 నమోదైతే ఈ ఏడాది 166 ఫైల్ అయ్యాయి.
* ప్రాపర్టీ వివాద కేసులు 64 శాతం మేర తగ్గాయి.
* నేరాల్లో శిక్షలు పడిన కేసుల సంఖ్య కూడా బాగా పెరిగింది.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
