BJP protest INDIA alliance
*భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి దిష్టిబొమ్మ దగ్ధం*
ఆకేరు న్యూస్, ములుగు:
మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఇండియా కూటమి వ్యవహరించిన తీరును నిరసిస్తూ
శనివారం భాజపా మండల అధ్యక్షులు మార్క సతీష్ ఆధ్వర్యంలో గోవిందరావు పేట మండలం పస్రా గ్రామంలో జాతీయ రహదారి 163 పై ఇండియా కూటమి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పార్లమెంటు లో మహిళా రిజర్వేషన్ బిల్లు ను వ్యతిరేకించి బిల్లు పాస్ కాకుండా చూసిన ప్రతి పక్షాల నేతలు, ఇండియా కూటమి దిష్టిబొమ్మను దహనం చేశామన్నారు.
నారీ శక్తి వందన్ లో భాగంగా మహిళల కు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు లో బిల్లు ప్రవేశ పెడితే ప్రతిపక్షాలు ఎక్కడ బిజేపి కి కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందో అని అక్కసుతో ప్రతి పక్షాలు, ఇండియా కూటమి కుల్లు, కుతంత్రాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లును వీగి పోయేలా చేసి వికటాట్టహాసం గా చంకలు గుద్దుకునేలాగా ప్రవర్తించిన తీరుకు మహిళా లోకం గమనించింది అని, రాబోయే రోజుల్లో మహిళలే ఇండి కూటమికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు టి దేవెందర్ రావు , జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి వెంకట్ , జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కొత్త సుధాకర్ రెడ్డి , నిడుమోలు శ్రీనివాస్, మేరుగు సత్యనారాయణ, కర్ర సాంబశివ రెడ్డి, గాందర్ల నరేష్, ఏదునూరి రమేష్, వంగాల సోమ్మిరెడ్డి, వలుపదాసు రవిశంకర్, బొల్లంపల్లి మురళి , మార్త రమేష్, అమ్మ లింగయ్య , బండి మోహన్, నిడుమోలు సాంబయ్య , బండి వేణు, జవహర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
