* హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
* కరీంనగర్ కలెక్టర్కు వినతి పత్రం
ఆకేరు న్యూస్, హుజూరాబాద్: రెండవ విడత దళిత బంధు లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.ఇప్పటి వరకు 13,000 మందికి నిధులు విడుదలవగా,రెండవ విడతలో 5,000 మంది దళిత బంధు లబ్ధిదారులకు నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలసి వినతి పత్రం అందించారు. రెండవ విడుత దళిత బంధు లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లో నిధులు జమ అయినప్పటికీ, వాటిని ఫ్రీజ్ చేయడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ,అకౌంట్ ఫ్రీజ్నీ వెంటనే ఎత్తివేయాలని అలాగే నిధుల విడుదల ఆలస్యం అవుతోందనీ వెంటనే వాటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
