
– 20వ తేదీలోపు అప్లై చేసుకోవాలి
– కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు
ఆకేరు న్యూస్ , కమలాపూర్: ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకం కోసం మండలంలోని చిన్న,సన్నకారు రైతులు అప్లై చేసుకోవాలని కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు మంగళవారం తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవనాల పెంపకం చేపట్టేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది.ఇందులో భాగంగా పండ్ల తోటల పెంపకం కింద మామిడి,నిమ్మ, బత్తాయి,జీడిమామిడి,జామ,సీతాఫలము, సపోటా,ఆయిల్ ఫామ్,అల్లనేరడి,ఆపిల్ బేర్,దానిమ్మ,మునగ,కొబ్బరి,డ్రాగన్ ఫ్రూట్ వంటి తోటల పెంపకంతో పాటు గట్లపై అల్లనేరడి,కొబ్బరి,సితాఫల్,జామ,కరోడా వంటి పండ్ల మొక్కలు పెంచుకొనుటకు దరఖాస్తు చేసుకోవలని ఎంపీడీవో తెలిపారు.ఉపాధి హామీ కూలీలతో గుంతలు తీయించడం, ప్రభుత్వ నిబంధనల ప్రకారము మొక్కల ఖర్చు చెల్లించడం, అంతర పంటల నిర్వహణ ఖర్చులు, ఎరువుల ఖర్చులు, ప్రతినెల నీటి నిర్వహణ ఖర్చులు కూడా చెల్లించడం జరుగుతుందనీ ఎంపీడీవో తెలిపారు.
కావలసిన ధ్రువీకరణ పత్రాలు
సన్నా, చిన్నకారు ధ్రువీకరణ పత్రము,భూమి సంబంధిత పట్టా పాస్ బుక్, ఉపాధికార్డు, గ్రామపంచాయతీ తీర్మానం, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డ్ తో గ్రామపంచాయతీ కార్యాలయంలో గాని, మండల పరిషత్ కార్యాలయంలో 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
………………………………….