Mallu Bhatti Vikramarka Telangana Rising 2047
* ఆక్రమణలపై ‘హైడ్రా’ ఉక్కుపాదం
– అమెరికాలో భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్ , డెస్క్:
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తోందని, రాష్ట్ర రూపురేఖలను మారుస్తూ ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలను ఎన్ఆర్ఐలకు ఆయన వివరించారు.
* $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం..
‘భారత్ ఫ్యూచర్ సిటీ’తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ డాలర్లు, రాబోయే ఐదేళ్లలో $1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ ప్లాన్‌ను అమలు చేస్తోందని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు తోడుగా నాల్గవ మహానగరంగా ముచ్చర్ల ప్రాంతంలో కాలుష్య రహిత నెట్-జీరో (Net-Zero) ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్ (CURE), పెరి-అర్బన్ (PURE), రూరల్ అగ్రి (RARE)గా మూడు ఆర్థిక మండలాలుగా వర్గీకరించి వేగంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.‘యంగ్ ఇండియా’తో విద్యా రంగంలో విప్లవంయువతను అంతర్జాతీయ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని వెల్లడించారు.పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని నెలకొల్పామని చెప్పారు.ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.టాటా గ్రూప్ భాగస్వామ్యంతో రూ. 2,100 కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను హైటెక్ డిజిటల్ శిక్షణా కేంద్రాలుగా మారుస్తున్నామన్నారు.దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం పూట పౌష్టికాహార ‘బ్రేక్‌ఫాస్ట్’ పథకాన్ని అమలు చేస్తున్నామని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఇంటర్ విద్యార్థులకు ‘మధ్యాహ్న భోజన’ సౌకర్యాన్ని విస్తరించినట్లు తెలిపారు.
* ఆక్రమణలపై ‘హైడ్రా’ ఉక్కుపాదం..
మూసీకి పూర్వవైభవంహైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు ‘హైడ్రా’ (HYDRAA) వ్యవస్థను తీసుకొచ్చామని, ప్రకృతి వనరులను పరిరక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. లండన్ థేమ్స్ నది తరహాలో ‘మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు’ ద్వారా మూసీ నదిని శుద్ధి చేసి, పర్యాటక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు.ఆర్థిక క్రమశిక్షణతో ఉద్యోగులకు సంక్షేమ భరోసాగత పదేళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థిక విచ్ఛిన్నతకు గురైందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేయడం వల్ల గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ జీతాలు అందడంలో తీవ్ర జాప్యం జరిగేదని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక క్రమశిక్షణ పాటించి వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 1.20 కోట్ల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఆరు గ్యారెంటీలతో సుపరిపాలనఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రాధాన్యతా క్రమంలో వేగంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి నిర్ణయాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాయని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయమే పునాదిగా సాగుతున్న తెలంగాణ పునర్నిర్మాణంలో విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
———————
———————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
