* రోడ్డు ప్రమాదంలో గర్భిణీ వైద్యురాలు మృతి!!
ఆకేరు న్యూస్,వరంగల్:హంటర్ రోడ్లో రోడ్డు ప్రమాదంలో ఓ వైద్యురాలు దుర్మరణం చెందారు. విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో మృత్యువు లారీ రూపంలో ఆమెచెంతకు చేరింది .హన్మకొండకు చెందిన డాక్టర్ మమతారాణి (33) ఫాదర్ ఆఫ్ కొలంబియా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంగళవారం తన విధులు పూర్తి చేసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా, హంటర్ రోడ్ వద్ద వేగంగా వచ్చిన లారీ ఆమె వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో మమతారాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతురాలు 9 నెలల గర్భిణీ అని తెలియడంతో తీవ్ర విషాదం నెలకొంది. మరో కొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన వైద్యురాలు, ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ కలిచివేసింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై విచారణ జరుపుతున్నారు. డాక్టర్ మమతారాణి మృతి పట్ల వైద్య వర్గాలు మరియు తోటి సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
