* ఆదర్శంగా నిలిచిన పాలకుర్తి తహసీల్దార్..
ఆకేరు న్యూస్,జనగామ: పాలకుర్తి మండల తహసీల్దార్ “సరస్వతి” సమాజానికి సరికొత్త సందేశాన్ని ఇచ్చారు.సర్కార్ బడి అంటే చిన్న చూపు చూసే ఈ రోజుల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని చాటిచెబుతూ, తన కుమారుడిని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా వసతులు ఉన్న ఈ బడిని తహసీల్దార్ ఎంచుకున్నారు.ఈ పాఠశాల గతంలో ఉత్తమ ఫలితాలతో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకుంది.అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిదిరాల శ్రీనివాస్ మరియు సిబ్బంది తహసీల్దార్ నిర్ణయాన్ని అభినందించారు. అధికారులే స్వయంగా తమ పిల్లలను సర్కారు బడిలో చేర్పించడం ప్రభుత్వ విద్యావ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
