Kamalapur Double Bedroom Houses
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో పేదల సొంతింటి కల నెరవేరింది. సోమవారం రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పట్టాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ప్రత్యేక కృషి, మంత్రుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. గడిచిన పదేళ్లలో సాధ్యం కాని ఇళ్ల పంపిణీని ప్రస్తుత ప్రభుత్వం సుసాధ్యం చేసిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే మరిన్ని ఇళ్లు మంజూరు కానున్నాయని మంత్రులు తెలిపారు. ఆనాడు పదేళ్లు అధికారంలో ఉండి అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చి ఎన్నికల సమయంలో డబుల్ హామీ ఇచ్చి అది కలగానే బిఆర్ఎస్ పార్టీ మార్చారని, కనీసం కట్టిన ఇళ్లను కూడా పంచేస్థితిలో లేరని, ఎన్నికల కోసం మభ్యపెట్టారే తప్ప పేదల సంక్షేమంపై నిజమైన చిత్తశుద్ధిలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి గడపకి సంక్షేమం,ప్రతి ఇంటికి అభివృద్ధి తో ముందుకు వెళ్తున్నామని కుల, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, రాబోయే ఆగస్టు 15 నుండి కొత్త పింఛన్లు కూడా ప్రారంభిస్తామని మంత్రులు స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా మాజీ చైర్మన్ ఇనుగాల వెంకట్ రాం రెడ్డి, ఇంచార్జి వొడితల ప్రణవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
