Pet Dogs Care Tips in rainy season
* చలి కాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలి
* చలికాలంలో కుక్కలకు పక్షవాతం
ఆకేరు న్యూస్, వరంగల్ :
పెట్ డాగ్…అది చేసే చిలిపి చిలిపి చేష్టలను జంతు ప్రేమికులు ఎంతో ఇష్టపడుతున్నారు. వాటికి ముద్దు ముద్దు పేర్లు పెట్టి ఇంట్లో తోటి మనుషుల్లాగే వాటిని అపురూపంగా చూస్తుంటారు. అయితే వాటికి సడన్ గా ఏమైనా అయితే మాత్రం..ఒకటే టెన్షన్ పడుతుంటారు. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక తికమక పడుతుంటారు.
ప్రస్తుతం వర్షాకాలం సీజన్ వచ్చింది కాబట్టి వర్షంలో పెట్ డాగ్స్ ని బయటకు తీసుకెళ్లొచ్చా? ఒకవేళ తీసుకెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటికి పెట్టే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక టెన్షన్ పడుతుంటారు. మనం టెన్షన్ పడే ఇలాంటి ప్రశ్నలన్నింటికి ప్రముఖ వెటర్నరీ డాక్టర్ వంశీ పాపాని..ఆకేరు న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు.
* పెట్ డాగ్స్ కి జ్వరం వస్తుందా..?
మనుషుల్లాగే పెంపుడు జంతువులకు కూడా జలుబు చేస్తుంది? జ్వరంతో పాటు ఇన్ ఫెక్షన్స్ కూడా వస్తాయని వెటర్నరీ డాక్టర్ వంశీ పాపాని చెప్తున్నారు. మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పెట్ డాగ్స్ అనారోగ్యం బారిన పడటం ఖాయమంటున్నారు.పెంపుడు జంతువులకు కూడా క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, కీళ్లనొప్పులు, కీళ్ల వ్యాధులు, గుండె జబ్బులు, డిమెన్షియా, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయంటే మనం నమ్మగలమా? కానీ డాక్టర్ వంశీ పాపాని చెప్తున్న విషయాలను గమనిస్తే మాత్రం నమ్మి తీరాల్సిందే.
కుక్కలను ఎంత ప్రేమగా పెంచినా..ఒక్కోసారి వాటి శారీరక, మానసిక స్థితి బాగోలేకపోతే అవి మనల్ని కరవడానికీ వెనుకాడవు. ఇటీవల కాలంలో పెంపుడు కుక్కలు నిత్యం మనుషులపై దాడులు చేస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే జంతు ప్రేమికులు తమ పెడ్ డాగ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు.
* వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులకే కాదు..మన ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల సంరక్షణలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని ప్రముఖ వెటర్నరీ డాక్టర్ వంశీ పాపాని సూచిస్తున్నారు. వర్షాకాలంలో పెంపుడు కుక్కలకు ముఖ్యంగా చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తాయని..అందుకే వాటి బెడ్డింగ్ పొడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే 50 శాతం చర్మ వ్యాధులు రాకుండా నివారించవచ్చు.
వర్షంలో పెట్ డాగ్స్ ని తీసుకెళ్లినప్పుడు వాటి బాడీలోకి వార్మ్స్ చేరే ఛాన్స్ ఉంది. అందుకే తప్పకుండా డీవార్మింగ్ చేయించాలి. వర్షంలో వాకింగ్ తీసుకెళ్లినప్పుడు, ఇంటికి రాగానే వాటి పాదాలను శుభ్రంగా కడగాలి. లేదంటే పాదాల మధ్య ఇన్ఫెక్షన్ వచ్చి, అవి నాకడం వల్ల పుండ్లు పెద్దవవుతాయి. ఇంట్లో మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకుంటే దోమల కాటు, మైట్స్ మరియు టిక్స్ రాకుండా కాపాడుకోవచ్చు. వర్షాలతో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి..నీళ్లు చల్లగా ఉంటే అవి ఇష్టపడవు. అందుకే వాటికి స్వచ్చమైన డ్రింకింగ్ వాటర్ ని మాత్రమే అందించాలి.
* చలికాలంలో కుక్కలకు పక్షవాతం
వింటర్ సీజన్లో పెంపుడు కుక్కలకు అప్పుడప్పుడు పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి..వాటి బాడీని వెచ్చగా ఉంచాలని ప్రముఖ వెటర్నరీ డాక్టర్ వంశీ పాపాని సూచిస్తున్నారు. చలికాలంలో వాటి వెంట్రుకలను కత్తిరించడం వంటివి చేయవద్దన్నారు. చలికాలంలో అవసరమైతే డాగ్స్ కి టీషర్టుల వంటివి తొడిగి అవి వెచ్చగా..హాయిగా నిద్రపోయేలా చూడాలి. అవి పడుకునే బెడ్ పొడిగా, వెచ్చగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
* కుక్కలకు ప్రిజ్‌లో ఆహారం పెట్టకూడదు
పెంపుడు కుక్కలకు ఇచ్చే ఫుడ్ మరియు బౌల్స్ విషయంలో వాటి యజమానులు చాలా జాగ్రత్తలు పాటించాలి. కమర్షియల్ డాగ్ ఫుడ్ పెట్టేటప్పుడు అవి తగినంత వాటర్ తాగుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. తాగే నీరు తగ్గితే కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఫ్రిజ్ లో పెట్టిన ఫుడ్ ని అస్సలు పెట్టకూడదని..ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ మాత్రమే పెట్టాలి. గోరువెచ్చగా ఉండే ఆహారాన్ని ఇస్తే అవి ఇష్టంగా తింటాయి. చల్లటి నీటికి బదులుగా రూం టెంపరేచర్ కి తగ్గట్లుగా వాటర్‌ని అందిస్తే అవి ఇష్టంగా తాగుతాయి.
ఫుడ్ బౌల్స్ ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడగాలి. లేదంటే ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. సమ్మర్, రెయినీ, వింటర్..ఇలా కాలం ఏదైనా..ఆ కాలానికి తగినట్లు జాగ్రత్తలు తీసుకుంటే పెంపుడు కుక్కలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని వెటర్నరీ డాక్టర్ వంశీ పాపాని వివరిస్తున్నారు. సో…ఇంట్లో కుక్కలను పెంచుకునే యజమానులు.. మనుషుల మాదిరిగానే వాటిని కూడా ప్రేమగా, ఆప్యాయంగా పలకరిస్తూ చూసుకుంటే అవి చాలా హెల్తీగా ఉంటాయని సూచిస్తున్నారు.
—————————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
