*ఇంటింటి ప్రచారం నుంచి ‘డిజిటల్’ వార్ వరకు!
ఆకేరు న్యూస్, చౌటుప్పల్: మున్సిపల్ ఎన్నికల వేడి చౌటుప్పల్ పురపాలక సంఘంలో పీక్స్‌కు చేరింది. అయితే ఈసారి ప్రచారం కేవలం వీధులకే పరిమితం కాలేదు; ఓటర్ల జేబుల్లోని మొబైల్ ఫోన్లలోకి చేరింది. అభ్యర్థులు ఒకవైపు ఇంటింటికీ తిరుగుతూనే, మరోవైపు సోషల్ మీడియాను ప్రధాన యుద్ధక్షేత్రంగా మార్చుకున్నారు.ప్రతి అభ్యర్థి ఇప్పుడు ఒక ‘డిజిటల్ ఇమేజ్’ను సృష్టించుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ లైవ్ సెషన్లను వాడుతున్నారు. అభ్యర్థి వార్డులో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ప్రతి క్షణాన్ని ప్రొఫెషనల్ కెమెరామెన్లతో షూట్ చేయించి, ఆకర్షణీయమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రజల ముందుకు తెస్తున్నారు.ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా వార్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నాయి.ప్రతి వార్డుకు ఒక డిజిటల్ టీమ్‌ను కేటాయించి, స్థానిక సమస్యలు – పరిష్కారాలపై పోస్టులు పెట్టిస్తున్నారు.ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలకు నిమిషాల వ్యవధిలోనే గట్టి కౌంటర్లు ఇవ్వడం, పాత అభివృద్ధి పనుల వీడియోలను షేర్ చేయడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.ప్రచారం జోరుగా సాగుతున్నా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం (Fake News) పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాత వీడియోలను ఎడిట్ చేసి ప్రస్తుత పరిస్థితిగా చూపించడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం వంటి అంశాలపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు.”సోషల్ మీడియా వేదికగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రతి పోస్టుపై మా నిఘా ఉంటుంది” అని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల అధికారులుఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు ఓటర్ల మొబైల్ స్క్రీన్లపై కనిపిస్తున్న ఈ ‘డిజిటల్ ప్రచారం’ ఎంతవరకు ఓట్లుగా మారుతుందనేది ఆసక్తికరంగా మారింది. సాంప్రదాయ ప్రచారానికి తోడుగా ఈ ఆధునిక వ్యూహం ఎవరికి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
