Errabelli Dayakar Rao
* రాయపర్తిలో అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆకేరు న్యూస్, రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇజ్జగిరి సమ్మయ్య, దూరిశెట్టి కొమురయ్యలను రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్-ఛార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం నేరుగా వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారి క్షేమ సమాచారాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరించి, పార్టీ వారికి ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాయకులు ఇద్దరూ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
కష్టకాలంలో నాయకులను పరామర్శించి ధైర్యం చెప్పడం ఎర్రబెల్లి సమర్థవంతమైన నాయకత్వానికి, కార్యకర్తలపై ఆయనకున్న ప్రేమానురాగాలకు నిదర్శనమని స్థానిక నాయకులు కొనియాడారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.

