France Student Protests
* ఫ్రాన్స్‌లో బడిపిల్లల పోరుబాట
ఆకేరు న్యూస్- స్పెషల్ డెస్క్: ఫ్రాన్స్ విద్యార్థి ఉద్యమాలతో అట్టుడుకుతోంది. దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది (Zen-Alfa) విద్యార్థులు రోడ్డెక్కటంతో దేశం స్తంబించిపోయింది. పాఠశాలల సమస్యలు పరిష్కరించాలంటున్న బడిపిల్లలను మెక్రాన్ (EJMF Mcron) ప్రభుత్వం అరెస్టులు నిర్బంధాలతో అణచివేయజూడటంతో ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసుల గ్రెనెడ్ పేలి ఓ విద్యార్థి చేయి పూర్తిగా తెగిపోయింది. 200కుపైగా విద్యార్థులు, పోలీసులు, పాఠశాల సిబ్బంధి గాయపడ్డారు. విద్యార్థులకు మద్దతుగా వారి తల్లిదండ్రులు, కార్మికులు, ఇతర వామపక్ష పార్టీలు ఆందోళనలో చేరుతుండటంతో.. విద్యార్థి ఉద్యమం దేశ గతినే మార్చేసే స్థితి కనిపిస్తున్నది.
సమస్యల నిలయాలుగా పాఠశాలలు..
ఫ్రాన్స్ (France ) లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కనీస వసతుల కొరతతో కునారిల్లుతున్నవి. తరగతి గదుల్లో కనీస సదుపాయాలు కరువయ్యాయి. సరిపడా కుర్చీలు, బల్లలు లేక విద్యార్థులు అవస్థలు పడుతు న్నారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగినప్పుడు తరగతి గదుల్లో ఏసీ సౌకర్యం లేకపోవటమే కాదు, కనీసం తగిన వెంటిలేషన్ కూడా లేక ఉక్కబోతతో విద్యార్థులు అల్లాడిపోతున్నారు. ఒక్కో గదిలో ముప్పై నుంచి ముప్పై ఐదు మంది విద్యార్థు లు కిక్కిరిసి కూర్చోవడం వల్ల బోధన నాణ్యత పూర్తిగా దెబ్బతింటోంది.
టీచర్ల కొరత..
ఫ్రాన్స్‌లోని పాఠశాలల్లో బోధనా సిబ్బంది లేమి దీర్ఘకాలికంగా కొనసాగుతున్నది. టీచర్ల కొరతతో దాదాపు పది శాతం బోధనా గంటలు వృథా అవుతున్నాయి. సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో విద్యార్థుల విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారుతోంది. సంవత్సరాల తరబడి ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వ అలసత్వమే నేటి ఈ అసంతృప్తికి ప్రధాన కారణం.
దావానలంలా విస్తరించిన విద్యార్థి ఉద్యమం..
పారిస్ సమీపంలోని క్రెటీల్ ప్రాంతంలో ఒక హైస్కూల్ (లీసే-Leese) లో చిన్న నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా వేగంగా పాకింది. మార్సెయిల్, స్ట్రాస్‌బర్గ్, లిల్లె వంటి ప్రధాన నగరాలకు ఈ నిరసనలు కార్చిచ్చులా విస్తరించాయి. వందలాది పాఠశాలల ప్రధాన గేట్లను విద్యార్థులు దిగ్బంధించి నిరసనను ఉధృతం చేశారు.
విద్యార్థులపై పోలీసుల ఉక్కుపాదం..
విద్యార్థి ఆందోళనకారులను అణచివేయడానికి ప్రభుత్వం భద్రతా బలగాలను రంగంలోకి దించింది. నిరసనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కేనాన్లు ప్రయోగించడంతో విద్యార్థుల ఆందోళన (Voilent) హింసాత్మకంగా మారింది. కోపోద్రిక్తులైన విద్యార్థులు సుమారు వంద పాఠశాలలను తగులబెట్టారు. కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో విద్యార్థులు, పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వేలాది మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడంతో దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ మధ్య కాలంలో పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఉపాధ్యాయుల జీతభత్యాల్లో కోత విధించింది. ప్రభుత్వ ప్రతిపాదించిన బడ్జెట్ కోతలు, ఆర్థిక సర్దుబాట్ల విధానాలపై ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టారు. టీచర్లకు మద్దతుగా పాఠశాల విద్యార్థులు కూడా ఆందోళనకు దిగటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యారంగంపై ప్రభుత్వ ఖర్చులను పెంచాలని, సంక్షేమ పథకాలను కుదించకూడదని విద్యార్థులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను పునఃసమీక్షించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
ట్రంప్ కార్డ్..
సందులో సడేమియాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ట్రంప్ కార్డ్ (Trump card) తీశాడు. ఫ్రాన్స్ విద్యార్థి ఉద్యమాన్నితనకు అనుకూలంగా వాడుకోజూస్తున్నాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్నది స్టుడెంట్ మూమెంట్ (Student moment) కాదనీ, దేశాన్ని ఆక్రమించేందుకు ఇస్లాం మతం చేస్తున్న ప్రయత్నమని అన్నాడు!
రాజకీయ సమీకరణాలపై పెను ప్రభావం..
ఫ్రాన్స్ లో జెన్ ఆల్ఫా ఉద్యమ తీవ్రత ఫ్రాన్స్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసేట్లుగా కనిపిస్తున్నది. రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఇది ప్రధాన అజెండాగా మారి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి విపక్షాలకు బలమైన ఆయుధంగా మారబోతున్నది. విద్యార్థి నిరసనలకు వామపక్ష పార్టీలు బహిరంగంగా మద్దతు ఇస్తుండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు సమీకృతమవుతోంది. మరో వైపు, శాంతిభద్రతల వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ మితవాద పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. తమ ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.
నాయకత్వ మార్పు దిశగా సంక్షోభం..
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నాయకత్వంలోని ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయత క్రమంగా సన్నగిల్లుతోంది. ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే ప్రధాని, అతని మంత్రివర్గంపై తీవ్ర రాజకీయ ఒత్తిడి పెరిగి, కేబినెట్లో కీలక మార్పులు చేయాల్సి రావచ్చు. ఈ పరిణామాలు రానున్న కాలంలో ఫ్రాన్స్ రాజకీయాల్లో పెను మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

