* తెలుగు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటన
* చెరో కోటి ఇచ్చిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్
* సోనూసూద్ కూడా అంతే..
* చెరో రూ. 50 లక్షలు ప్రకటనకు అల్లు అర్జున్
* ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, పవన్ కల్యాణ్ విరాళాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరద విపత్తులతో బాధితులను అదుకునేందుకు సినీ ప్రముఖులు(Celebraties) ముందుకు వస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna), జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR), మహేష్(Mahesh), పవన్ కల్యాణ్(PavanKalyan) రూ. కోటి చొప్పున విరాళాలు ప్రకటించారు. తాజాగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ చెరో కోటి అందించారు. సోనూసూద్ కూడా చెరో కోటి ప్రకటించారు. అల్లు అర్జున్ కూడా చెరో రూ. 50 లక్షలు ప్రకటించారు. విశ్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, త్రివిక్రమ్, సూర్యదేవర రాధాకృష్ణ, నాగవంశీ, డైరెక్టర్ వెంకీ అట్లూరి, అనన్య నాగళ్ల తదితరులు కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధి(Cm Relief Fund)కి విరాళాలు అందించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
