Kamalapur Solar Power Plant
Published:
ఆకేరు న్యూస్ , కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న రూ.2 కోట్ల విలువైన 0.5 మెగా వాట్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, న్యాప్స్క్యాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ముఖ్య అతిథులుగా హాజరై సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్లు, సర్పంచ్లు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
