ఆకేరు న్యూస్, కమలాపూర్: కమలాపూర్ మండల కేంద్రంలో జూలై 23వ తారీఖున జరిగిన పుస్తెల తాడు చోరీ కేసును కమలాపూర్ పోలీసులు ఛేదించారు. గురువారం చోరీకి సంబంధించిన వివరాలను పోలీసు ఇన్స్పెక్టర్ హరికృష్ణ వెల్లడిరచారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సంవత్సరం జూలై 23న కమలాపూర్ కొత్త బస్టాండ్ సమీపంలోని ఇంట్లో రాత్రి సమయంలో ఒక వృద్దురాలు ఇంటి నుంచి బయటికి రాగా వృద్ధురాలు ఇంటి పక్కన గల కంగన్ హాల్ గద్దె పైనుండి లోపలికి దూకి వృద్ధ మహిళ మెడలో నుండి సుమారు 3 తులాల బంగారు పుస్తెలతాడును మాటేటి రమేష్ దొంగిలిస్తుండగా దానికి మొగిలిచర్ల ప్రశాంత్ సహకరించాడని సిఐ హరికృష్ణ తెలిపారు. దొంగిలించిన బంగారంను అమ్ముకునే విషయంలో సహకరించిన వెనిశెట్టి పున్నం చందర్, పల్లెపు లక్ష్మీనారాయణ లను గురువారం ఉదయం గూడూర్ ఎక్స్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని విచారించగా వారి వద్ద నుండి 29 గ్రాముల కరిగించిన బంగారపు ముద్ద మరియు 20వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకొని, నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు సిఐ హరికృష్ణ తెలిపారు.
…………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
