* వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఆకేరున్యూస్, వరంగల్: తాత్కాలిక బాణాసంచా విక్రయాలకు అనుమతి కోసం ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తు ఫారంతో తప్పనిసరిగా అగ్నిమాపక విభాగం అధికారులు జారీచేసిన ఎన్.ఓ.సితో పాటు, ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు అయితే స్థల యజమాని అనుమతి పత్రం, అలాగే ప్రభుత్వ స్థలాల్లో అయితే సంబందిత ప్రభుత్వ అధికారుల అనుమతి పత్రం, పక్క నిర్మాణాల్లో ఏర్పాటు చేస్తే వారి అనుమతితో పాటు పక్క భవన బ్లూ ప్రింట్‌తో పాటు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, ఆదాలట్ శాఖలో ఎనిమిది వందల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లుగా బ్యాంక్ చాలన్తో దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అక్టోబర్ 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు బాణాసంచా అనుమతులు జారీ చేస్తారు. ఎవరైనా ఎలాంటి అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ తెలిపారు.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
